News

భారత్ , పాక్ ల మధ్య యుద్ధం వస్తే?

749views

ర్టికల్ 370, 35A ల రద్దు క్రమంలో భారత్, పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత సరిహద్దుల చుట్టూ పాకిస్థాన్ తన ఎస్.ఎస్.జీ కమాండోలను మోహరించడం, వివిధ మార్గాల ద్వారా తీవ్రవాదులను భారత్లోకి చొప్పించి దేశ వ్యాప్తంగా హింసాత్మక సంఘటనలకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా అందుతున్న ఇంటలిజెన్స్ రిపోర్టులు, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రైల్వే శాఖా మంత్రి షేక్ రషీద్ తదితరుల మాటలు అన్నీ చూస్తూ వుంటే భారత్, పాక్ ల మధ్య యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది కదూ?

అయితే పాకిస్థాన్ కు అంత సీన్ లేదని భారత జాతీయ భద్రతా సలహా మండలి మాజీ సభ్యుడు, భారత అణు విధాన రూపకల్పన సభ్యుడు భరత్ కర్నాడ్ తేల్చేశారు. భారత్ పై అణ్వస్త్రాన్ని పాక్ ప్రయోగించలేదని..ఆయుధాల్లేవు, డబ్బులు లేవు, ఇతర నిల్వలు కూడా లేవని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ యుద్ధమే జరిగితే భారత్ పాకిస్థాన్ కు అత్యంత కీలకమైన ఇస్లామాబాద్, కరాచీ, సియాల్ కోట్, రావల్పిండిలను భారత్ తుడిచి పెట్టేస్తుందని భరత్ కర్నాడ్ చెప్పారు.

పాక్ భారత్ పై యుద్ధానికి దిగుతుందనే ఆలోచన కూడా అనవసరమని అన్నారు. యుద్ధం వస్తే భారత్ ఎంత దూరమైనా వెళ్తుందనే విషయం పాక్ కు తెలుసని అది అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందనే విషయం పాక్ ఆర్మీకి కూడా తెలుసని చెప్పారు. భారత్ ను సమూలంగా దెబ్బతీసే శక్తి కానీ, అన్ని అణ్వస్త్రాలు కానీ పాక్ లేవని ఆయన అన్నారు. ఇక కశ్మీర్ విషయంలో ఆ దేశం చేస్తున్నది కేవలం న్యూసెన్స్ మాత్రమేనని చెప్పి పాక్ పరువు తీసేశారు భరత్ కర్నాడ్.