
కాశ్మీర్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ పాకిస్థాన్ ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చెయ్యడంతో అధికార భాజపా నాయకులు మండిపడుతుండగా, కాంగ్రెస్ కాశ్మీర్ పై తాననుసరిస్తున్న వైఖరిపై పునరాలోచనలో పడినట్లుగా అనిపిస్తోంది. “కాశ్మీర్ భారత్లో ఎప్పటికీ అంతర్భాగమే”నని రాహుల్ ట్వీట్ చెయ్యడం, పాకిస్థాన్ సహా ఏ ఇతర దేశాలూ కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడం చూస్తుంటే ఒకింత విడ్డూరంగానే అనిపిస్తోంది.
“ఎప్పుడూ బాధ్యతా రహిత వ్యాఖ్యలు చేసే రాహుల్ గాంధీ కాశ్మీర్ విషయంలో యూ టర్న్ తీసుకున్నారు” అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ పాకిస్థాన్ ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ రాహుల్ తన బాధ్యతా రహిత వ్యాఖ్యలతో ఇన్నాళ్ళూ దేశాన్ని అవమానించారని జవదేకర్ అన్నారు.





