News

జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండాను దించి జాతీయ జెండాను ఎగురవేసిన అధికారులు.

90views

గష్టు 5న జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూకాశ్మీర్ సెక్రటేరియట్ తో సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండాను అవనతం చేసి భారత జాతీయ జెండాను ఎగురవేశారు. ఇప్పటి వరకూ ఈ కార్యాలయాలు, అధికారిక భావనాలన్నిటి మీదా రెండు జెండాలు ఎగురుతూ ఉండేవి. ఇహ ఇప్పుడు ఆ సంస్కృతికి చరమ గీతం పాడుతూ ప్రత్యేక జెండాను దించివేశారు. అక్టోబరు 31 నుంచి జమ్మూ కాశ్మీర్ పునర్విభజన కూడా అధికారికంగా అమలులోకి రానుంది. ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న జమ్ముకాశ్మీర్, లెఫ్టినెంట్ గవర్నర్ల పాలనలోకి వెళ్లనుంది.