
నెల్లూరు నగరంలో సాహితీ సుధా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో “నారదజయంతి” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాననీయ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రాంత సంఘచాలక్ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రాంత ప్రచారప్రముఖ్ బయ్యా వాసులతో పాటు ముఖ్య అతిథిగా నెల్లూరు డివిజన్ పోస్టాపీస్ సూపరిండెంట్ కాకర్ల శ్రీనివాస్ పాల్గొనగా
ప్రదానవక్తగా పాత్రికేయులు సాయి వ్యవహరించారు.
ఈకార్యక్రమంలో ప్రజాపలుకు దిన, మాసపత్రిక సంపాదకులు సుజనీ, HN 9 చానల్ ఎడిటర్ బట్టే పాటి శిరీషా, prema 9 నెల్లూరు జిల్లా బ్యూరో చీఫ్ దోర్నదుల నరేష్ కుమార్,రాజస్థాన్ పత్రిక జర్నలిస్ట్ విక్రమ కుమార్ జైన్ లను సాహితీ సుధా ఫౌండేషన్ తరపున నిర్వాహకులు సన్మానించారు.

అనంతరం సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో జర్నలిస్ట్ సాయి, ప్రాంత ప్రచారప్రముఖ్ బయ్యా వాసు, సహప్రాంత ప్రచారప్రముఖ్ వాసు తదితరులు పాల్గొన్నారు





