ArticlesNews

కూలీలకు సాధికారత కల్పించడం ద్వారా వ్యవసాయ రంగం బలోపేతం : చిత్రకూట్ సదస్సు

369views

చిత్రకూట్ ప్రకటన

చారిత్రక ఆధారాల మేరకు భారతదేశంలో వ్యవసాయ సమాజం, రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికుల మద్దతుతో కనీసం 10,000 సంవత్సరాలకు పైగా ఉంది. అయితే, చారిత్రక కారణాల వల్ల వీరిద్దరి మధ్య అసమ్మతి,అంతతరాలు నెలకొని ఉండడం వల్ల ఒకరి పట్ల మరొకరికి విశ్వసనీయత లోపించింది.

1930 నుండి, ఆంధ్రకు చెందిన ఆచార్య ఎన్.జి. రంగా, బీహార్‌కు చెందిన స్వామి సహజానంద సరస్వతి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన చౌదరి చరణ్‌సింగ్ వంటి వారు  వ్యవసాయ సమస్యలపై ఉద్యమించారు.  మార్క్సిస్టులు సహితం రైతులను ప్రధానంగా భూమిలేని వ్యవసాయ కూలీలను సంఘటితం చేశారు.

కొన్ని సమస్యలు పరిష్కరించబడినప్పటికీ, భూమిలేని వ్యవసాయ కూలీలను సంఘటితం చేయడంలో మార్క్సిస్టుల నిజమైన లక్ష్యం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కాదు, మార్క్సిస్ట్ విప్లవం కోసం గ్రామీణ భారతదేశంలో రైతులకు వ్యతిరేకంగా రైతు కూలీలను వర్గ పోరాటాన్ని సన్నద్ధం చేయటం.ఫలితంగా నిరంతరాయంగా1968 నుండి 2005 వరకు రక్తపాత సంఘటనలు దేశమంతా, ప్రత్యేకంగా బీహార్ లో జరిగాయి..సమాజాన్ని మరింత విభజించడానికి సంఘర్షణ, ఘర్షణ మనస్తత్వంతో నేటి వరకు తాత్విక కథనాలు (narratives ) ప్రభావితం కావించాయి.

పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ చివరి మనిషి వరకు అభివృద్ధి ఫలాలు చేరడము కోసం ‘అంత్యోదయ’ ఆవశ్యకతను స్పష్టం చేశారు.  ‘గ్రామోదయ నుండి సర్వోదయ’, (గ్రామీణ అభివృద్ధి నుండి అందరి అభ్యున్నతి వరకు); ‘సర్వోదయ నుండి అభ్యుదయ’ (అందరి ఉన్నతి నుండి అందరి ఎదుగుదల వరకు) అనే ఆలోచనను మన ముందుంచారు. ఈ దృక్పథాన్ని క్షేత్రస్థాయిలో రాష్ట్రఋషి నానాజీ దేశ్‌ముఖ్, దత్తోపంత్ తెంగ్దేజీ ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

సమగ్ర మానవతావాద సూత్రాల( Integral Humanisim) ఆధారంగా పరస్పర పూరకమైన, గ్రామ సమాజం లో సంఘర్షణ-రహిత అభివృద్ధికి, ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గాన్ని ఇది అందిస్తుంది. ఇంతవరకు భూమిలేని వ్యవసాయ కార్మికుల కోసం భారత ప్రభుత్వం వద్ద సమగ్ర విధానం లేదు. వారి సాధికారత, సంక్షేమం, పురోగతి, వ్యక్తిగతంగా, ఆర్థికంగా లేదా సామాజికంగా తాత్కాలికంగా, బహుళ ఏజెన్సీలు, మంత్రిత్వ శాఖలచే నియంత్రించబడుతోంది.

ఈ ‘భూమిలేని వ్యవసాయ కార్మికుల ఆర్థిక సాధికారత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం పై జాతీయ వర్క్‌షాప్’ 2024 జూన్ 29, 30 తేదీలలో మహాత్మా గాంధీ చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాల్యము, దీనదయాళ్ పరిశోధక సంస్థ,  మధ్యప్రదేశ్ జన అభియాన్ పరిషత్, ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వ  విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ప్రధుమాన్ సింగ్ తోమర్ సమక్షంలో, భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి డా. సంజయ్ పాశ్వాన్, సామాజిక సమరసత జాతీయ సంయోజకులు శ్రీ శ్యామ్ ప్రసాద్,  భారతీయ మజ్దూర్ సంఘ్ సంఘటన కార్యదర్శి శ్రీ బి. సురేంద్రన్, భోపాల్ లోని గవర్నర్ హౌస్ లో గిరిజన సెల్ చైర్మన్ శ్రీ దీపక్ ఖండేకర్(IAS R), డ.దినేష్ జీ( గ్రామ వికాస్)  వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ‘చిత్రకూట్ ప్రకటన’ను  ఏకగ్రీవంగా ఆమోదించారు:

చిత్రకూట్ ప్రకటన

  • గ్రామీణ జీవితం, వ్యవసాయం మన సంస్కృతిలో భాగం. దురదృష్టవశాత్తు నేడు వ్యవసాయం లాభదాయకంగా లేదు. వ్యవసాయానికి సమాజంలో గౌరవం లేదు. చాలా మంది రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్తున్నారు. దీని ఫలితంగా విచక్షణారహితంగా పట్టణీకరణ జరుగుతోంది. దానితో వలస కూలీలు ఎక్కువ మంది అవుతున్నారు. ఇలాగే కొనసాగితే దేశం తన అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తినీ చేయలేదు.
  • గ్రామీణ భారతదేశంలో, భూమిలేని వ్యవసాయ కూలీలు సమాజంలోని చాలా వెనుకబడిన తరగతులలో ఉన్నారు. వీరిలో యాభై శాతానికి పైగా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉన్నారు.
  • వ్యవసాయానికి అనువైన భూమిని కలిగి ఉండటం వల్ల రైతులకు ఆర్థిక ఆదాయ వనరుగా ఉండటమే కాకుండా సామాజిక హోదా కూడా లభిస్తుంది. షెడ్యూల్డ్ కులాల కార్మికులు కుల ప్రాతిపదికన వివక్షను కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి

  • భూమిలేని రైతు కూలీలను గ్రామీణ భారతదేశంలో అత్యంత వెనుకబడిన తరగతిగా గుర్తించాలి. వారి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ‘అంత్యోదయ యోజన’ వంటి పథకాన్ని రూపొందించాలి
  • రైతులపై ఆధారపడిన వ్యవసాయ గ్రామీణ కూలీలు, చేతివృత్తిదారులు, అందరూ ఒకే రైతుకుటుంబ సభ్యులు. సమాజంలో భూమిలేని కూలీలు, చేతివృత్తుల వారు సామరస్యంగా జీవించేలా రైతులలో అవగాహన కల్పించాలి. ప్రభుత్వం, సామాజిక సంస్థల అన్ని ప్రణాళికలు, కార్యకలాపాలు సమానమైన, సమ్మిళిత అభివృద్ధితో పాటు భాగస్వామ్య భవిష్యత్తుతో ‘వ్యవసాయ కుటుంబం’
  • (కృషి పరివార్) సూత్రాన్ని తెలియచెప్పే  సందేశాన్ని కలిగి ఉండాలి. తద్వారా గ్రామంలో విభేదాలకు ఆస్కారం ఉండదు.
  • కూలీలకు సాధికారత కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవచ్చు.