News

వీర సావార్కర్ మెడలో చెప్పుల దండ వేసి అవమానించిన కాంగ్రెస్ విద్యార్ధి విభాగం కార్యకర్తలు

221views

దేశ స్వాతంత్ర్య సాధన కోసం తన యావజ్జీవితాన్ని సమర్పించిన సమర వీరుడు స్వాతంత్ర్య వీర సావర్కర్ కి ఘోర అవమానం జరిగింది. కొందరు యువకులు ఢిల్లీ యూనివర్సిటీలోని వీర సావార్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి, ముఖానికి నల్ల రంగు పులిమారు. ఈ మేరకు ఒక విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా వినకుండా సావార్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన ఆ యువకులు ముఖానికి నల్ల రంగు పులిమి “NSUI జిందాబాద్” అని నినాదాలు చేయడం విడియోలో స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్ధి విభాగం NSUI కార్యకర్తలు ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఢిల్లీ యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆజన్మాంతం దేశసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఒక దేశభక్తుడికి జరిగిన ఈ అవమానం యావత్ భారత జాతికే జరిగిన అవమానంగా భావించవలసి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.