
780views
భారత్ ప్రయోగించిన మొదటి మూన్ ల్యాండింగ్ మిషన్ చంద్రయాన్ – 2 ని ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా గమనిస్తోందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖమైన మిషన్ అని ఆయన తెలిపారు.
చంద్రుడి మీదకు దిగే ‘ల్యాండర్ విక్రమ్’ ల్యాండింగ్ ప్రక్రియ సెప్టెంబరు ఏడో తేదీన ఉదయం 1.40కి ప్రారంభమై, దక్షిణ ధ్రువం మీదకు ఉదయం 1.55కు దిగుతుందని వెల్లడించారు. అలాగే చంద్రయాన్-3కి కూడా ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోందని శ్రీ శివన్ తెలిపారు. ఇస్రోలో స్త్రీ పురుషులెవరికైనా ప్రతిభ ఆధారంగానే గుర్తింపు, అవకాశాలు లభిస్తాయని పాత్రికేయులడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2కు ఎం.వనిత అనే మహిళా అధికారి ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని శ్రీ శివన్ గుర్తు చేశారు.





