News

అభినందన్ ను పట్టుకుని చిత్రహింసలకు గురిచేసిన ఆహ్మద్ ఖాన్ ను మట్టుబెట్టిన భారత సైన్యం.

156views

అభినందన్ వర్ధమాన్ చేసిన సాహసం ప్రతి ఒక్కరికీ గుర్తు ఉండే ఉంటుంది. పాక్ కు చెందిన ఎఫ్-16ను కూల్చివేసిన తరువాత  పారాషూట్ సహాయంతో అభినందన్ పాక్ లో సురక్షితంగా బయటపడ్డాడు. అప్పుడు కొందరు పాకిస్థాన్ యువకులు వెంటబడి అభినందన్ను పట్టుకున్నారు.అప్పుడు అభినందన్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, అభినందన్ను చిత్రహింసలకు గురిచేసిన అహ్మద్ ఖాన్ అనే కమాండో పాకిస్థాన్ లో హీరో అయ్యాడు.

ఆ అహ్మద్ ఖాన్ ను ఇప్పుడు భారత సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు ప్రయత్నించే క్రమంలో అహ్మద్ ఖాన్ హతుడయ్యాడు. చొరబాట్లు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన భారత బలగాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లోనే అహ్మద్ ఖాన్ మృతి చెందాడు. పాక్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ లోకి పంపించడంలో అహ్మద్ ఖాన్ ఇప్పటివరకు కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది.