53
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో పద్మసరోవరంలో తెప్పలపై విహరించి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది.