NewsProgramms

విజయవాడలో సేవాభారతి శిక్షకుల వర్గ

129views

గస్టు 18 ఆదివారం విజయవాడ సత్యనారాయణ పురం లోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో సేవాభారతి గుంటూరు విజయవాడ జిల్లాలోని టీచర్లకు ప్రశిక్షణ వర్గ నిర్వహించారు ఈ రెండు జిల్లాల నుండి 80 మంది టీచర్లు పాల్గొన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ప్రసిక్షణా వర్గలో  నైపుణ్యం కలిగిన అనుభవం ఉన్న టీచర్స్ శిక్షణ ఇచ్చారు. శ్రీ నరేంద్ర గారు  వేదిక్ మ్యాథమెటిక్స్ లో మంచి అనుభవం ఉన్న వారు. పిల్లలకు తేలికగా మ్యాథమెటిక్స్ ఎలా నేర్పాలి అనే విషయం పైన వారు అభ్యాసం చేయించారు. అలానే ఇంగ్లీషు పాఠ్యాంశాన్ని శ్రీమతి రాజేశ్వరి గారు  ఆంగ్లము ఎలా నేర్పాలి అనే అంశంపై అభ్యాసం చేయించారు. శ్రీమతి  పరమేశ్వరి గారు సంస్కృత అధ్యాపకులుగా పనిచేస్తున్నారు అభ్యాసిక పిల్లలకు తెలుగు ఎలా నేర్పించాలి అనే అంశం పైన అభ్యాసం చేయించారు. పిల్లలలో వ్యక్తిత్వ వికాసం మరియు మార్పు  ఎలా తీసుకురావాలి అనే అంశం పైన డాక్టర్ మురళీ కృష్ణ గారు ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఆరోగ్య భారతి జాతీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రీ కాకాని పృధ్వీరాజు గారు నిర్వహించారు.  శ్రీ యనుముల పిచ్చిరెడ్డి గారు సేవాభారతి గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రారంభంలో యోగ మెడిటేషన్ చేయించారు. శ్రీ పోగుల వెంకటేశ్వరరావు గారు పాల్గొని వారి సందేశమును ఇచ్చారు. ఈ కార్యక్రమాలను సేవాభారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సాయి కిషోర్ గారు, సేవాభారతి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె ఎస్ ఎన్ చారి గారు, పాల్గొని మార్గదర్శనం చేశారు .ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు పరిశీలకులుగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహించారు వారిలో ప్రముఖులు శ్రీమతి మాధురి గారు, శ్రీమతి నాగలక్ష్మీ గారు , శ్రీ రామకృష్ణ గారు సేవాభారతి రాష్ట్ర కోశాధికారి శ్రీ ఎస్ వి రాజేంద్ర ప్రసాద్ గారు కుంచనపల్లి శ్రీనివాస్ గారు పాల్గొని వర్గ నిర్వహించారు. అనంతరం వర్గ లో పాల్గొన్న టీచర్లు వారి యొక్క అనుభవాలను తెలియజేశారు.