అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో అద్భుతమైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ(అట్రీ), ఫెరిస్ క్రియేషన్స్లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది. అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. వందేళ్ల తరవాత బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేశారు. మొత్తం 16,724 చీమజాతుల్లో నీలి రంగు చీమలు అత్యంత అరుదు.
420views
You Might Also Like
అస్సాం వరదల బాధితులకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం
20
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు.
26
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం
రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం:...
గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో
37
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’
34
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర
36
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...




