ఎవరైనా ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు వేస్తుంటే ‘ఇక ఆపుతావా యక్ష ప్రశ్నలు?’ అనటం సర్వసాధారణం. కొంగ రూపంలో ఉన్న యక్షుడు అనే గంధర్వుడు అడిగిన ప్రశ్నలే ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి చెందాయి. ధర్మరాజుకు, యక్షుడనే గంధర్వురుడికి మధ్య జరిగిన సంభాషణ నుంచే ‘యక్ష ప్రశ్నలు’ అనే జాతీయం పుట్టింది. తన అధీనంలో ఉన్న సరస్సులోని నీటిని తన మాట కాదని తాగబోయిన భీమార్జున నకుల సహదేవుల ప్రాణాలను యక్షుడు హరిస్తాడు. సోదరులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ధర్మనందనుడు- వారి గురించి ఆరా తీశాడు. ముందు తానడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నాడు యక్షుడు. మహాబల పరాక్రమ సంపన్నులైన తన తమ్ముళ్లను ఓడించాడంటే.. ఆ గంధర్వుడు సామాన్యుడు కాడని ధర్మరాజు గ్రహించాడు. అతడు పెట్టిన ఆంక్షకు అంగీకరించాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలు, ధర్మరాజు చెప్పిన సమాధానాలు మన ధర్మంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. సర్వ మానవ శ్రేయస్సుకు సంబంధించిన తాత్త్విక, ఆధ్యాత్మిక, జీవన సత్యాలను యక్షుడు ధర్మరాజు నుంచి రాబట్టాడు. ఆ సమాధానాలతో సంతృప్తి చెంది, భీమార్జున నకుల సహదేవులను బతికించాడు. ఇంతకూ ఆ యక్షుడు మరెవరో కాదు.. సాక్షాత్తూ యమధర్మరాజు. ‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం మహాభారతంలోని అరణ్యపర్వం చివరలో వస్తుంది.
455views
You Might Also Like
ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య...
‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష
తెనాలి పరీక్ష". నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని...
దయ చూపండంటున్నా.. మహిళకు షరియా శిక్ష 100 కొరడా దెబ్బలు
11
ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో...
ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
10
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా...
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి.. విద్యార్థులకు అజిత్ డోభాల్ పిలుపు
27
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా...
పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
10
పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు...





