News

శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు

151views

శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్‌ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతో పాటు అదనంగా వచ్చే వారికి టికెట్‌ రేటు పెంచి విక్రయిస్తున్నారు. సాధారణంగా అభిషేకం టికెట్‌ ధర రూ.1500. దంపతులతోపాటు అదనంగా వచ్చే వారికి రూ.500 చొప్పున మరో టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం రాత్రి నుంచి ఈ అదనపు టికెట్‌లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దాంతో దేవస్థానం సిబ్బంది రూ.300 టికెట్లు రెండు కొనుగోలు చేయిస్తున్నారు. ఇలా ఒక్కో కుటుంబం రూ.500లకు బదులు రూ.600 వెచ్చించాల్సి వస్తోంది. పైగా ఒక్కో భక్తుడు రూ.300 టికెట్లు రెండు టికెట్లు తీసుకోవాలని ఆలయ అధికారులు షరతు విధించారు. దీంతో భక్తుల జేబుకు చిల్లు పడుతోంది.