News

అలరించిన ఆంధ్రనాట్య ప్రదర్శన

280views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ధర్మపథంలో భాగంగా ఆదివారం ఇంద్రకీలా ద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ప్రదర్శించిన ఆంధ్రనాట్య ప్రదర్శన, చిన్నారులు ప్రదర్శించిన ఆది శంకరాచార్యుల రూపకాలు భక్తులను అలరించాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై విజయవాడకు చెందిన శ్రీనటరాజ నృత్యాలయం నాట్యాచార్యుడు రాయన శ్రీనివాసరావు శిష్య బృందం పలు కీర్తనలకు నృత్యం చేసింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు నృత్య ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. మరో వైపు జగద్గురు ఆదిశంకరాచార్య జయంతిని పురస్కరించుకుని పలువురు చిన్నారులు ఆదిశంకరాచార్య రూపకాలను ప్రదర్శించారు.పలువురు భక్తులు ఆది శంకరాచార్య రూపంలో ఉన్న చిన్నారులతో ఫొటోలు,సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిచూపారు. అనంతరం చిన్నారులు ఆదిశంకరాచార్యులనగరోత్సవ సేవలో పాల్గొన్నారు. ఆది శంకరాచార్య రూపకంలో ఉన్న చిన్నారులను ఆలయ ఈఓ కె.ఎస్. రామరావు అభినందించారు. నగరోత్సవ సేవలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.