News

భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు

272views

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ కు ఫండ్ గా భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. భద్రతామండలి ఉగ్ర వాద నిరోధక కార్యాలయం(యూఎన్ సీటీ)లో ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ వోరోన్కోకు తానే స్వయంగా విరాళాలను అందించినట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మంగళవారం వెల్లడించారు. ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సభ్యదేశాల సామర్ధ్యాన్ని పెంపొం దించడంలో యూఎన్ ఓసీటీ ఆదేశాలకు భారత్ కట్టుబడి ఉందని, తాజా విరాళం దానికి నిదర్శనమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.