News

రేపు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం

246views

విశాఖలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం సింహాచలంలో ఈనెల 10 న శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి జరిగే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తో కలిసి ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ, గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ ఏడాది అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశామని, నీలాద్రి మండప ద్వారం నుంచే భక్తులు దర్శనం చేసుకుంటారని తెలిపారు.ఎలాంటి ప్రోటోకాల్ దర్శనాలు లేవని కూడా స్పష్టం చేశారు.ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య విభిన్న ప్రతిభావంతులకు దర్శనం కల్పిస్తామన్నారు. తదుపరి సామాన్య భక్తులకు అనుమతిస్తామన్నారు.నగరపోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ పార్కింగ్ ఏరియాలు , ఎంట్రీ, ఎగ్జిట్ ల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.చందనోత్సవానికి సంబంధించి 2 వేల మంది పోలీసులు విధుల్లో వుంటారని తెలిపారు.