News

శివుడికి నాలుక సమర్పించిన యువకుడు

324views

ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పిం చుకున్నాడు. అంజోరా పోలీస్ స్టేషను పరిధిలో ఈ ఘటన జరిగింది. రాజే శ్వర్ భార్య మూగది. ఉదయాన్నే గ్రామంలోని కొలను వద్దకు చేరుకొని, కాసేపు మంత్రోచ్చారణ చేశాక తన నాలుక కోసుకొన్న రాజేశ్వర్ గట్టున ఉన్న రాయిపై దాన్ని ఉంచాడు. రక్తస్రావంతో ఆలయంలో ఉన్న అతణ్ని గుర్తిం చిన గ్రామస్థులు అంబులెన్సును పిలిచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. శివుణ్ని మనసులో ఏదో కోరిక కోరుకొన్న రాజేశ్వర్ నాలుక కోసుకున్నాడని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.