News

తిరుపతిలో వేద విజ్ఞాన సదస్సు

69views

తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం,భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ,భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఆధ్వర్యంలో విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సమ్మేళనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం రూపుదిద్దుకుంటుందన్నారు. వేదాలు విజ్ఞాన భాండాగారాల‌న్నారు.ఆధునిక మాన‌వ స‌మాజం శాంతి సౌఖ్యాల‌తో జీవించ‌డానికి వేదాలు, ఆధునిక శాస్త్రాలను మిళితం చేయాలన్నారు. వేదాల్లో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు సాంకేతిక ప‌రిజ్ఞానం దాగి ఉంద‌న్నారు.