News

అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి

194views

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. బుధవారం ఉదయం అయోధ్యను చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ స్వాగతం పలికారు. బాలరాముడి దర్శనానికి ముందు రాష్ట్రపతి ముర్ము సరయూ నది తీరంలో జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హనుమన్‌గిరి ఆలయంలోని పూజలు నిర్వహించారు. జనవరిలో జరిగిన రామమందిర ప్రారంభోత్సవం అనంతరం ద్రౌపది ముర్ము తొలిసారిగా అయోధ్యలో పర్యటించారు.