306views
సూపర్‌సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. సిమెట్రిక్ సెపరేషన్, ఎజెక్షన్, వేగ నియంత్రణ వంటి అంశాలను ఈ సందర్భంగా పరిశీలించినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘స్మార్ట్’ అనేది కొత్తతరం క్షిపణి ఆధారిత తేలికపాటి టోర్పిడో వ్యవస్థ. జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. భారత నౌకాదళం కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దీన్ని అభివృద్ధి చేసింది.





