
మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా మత్స్య నారాయణ పురం (పేరు పాలెం) గ్రామంలోని శ్రీ మత్స్య నారాయణ స్వామి దేవలయంలో 4/8/19 ఆదివారం నాడు జరిగింది.
ఈ సమావేశంలో గడచిన రెండు నెలల కాలంలో మత్స్యకార సంక్షేమ సమితి అధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో జరిగిన కార్యక్రమాల సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మత్స్యకార గ్రామాలలో జరిగిన కుంకుమ పూజ, నెల్లూరులో ప్రారంభమైన మత్స్యకార సంక్షేమ సమితి వసతి గృహం, నెల్లూరులో జరిగిన భజన గురువుల సన్మాన కార్యక్రమాల సమీక్ష జరిగింది.

అలాగే రాబోయే రెండు నెలల (ఆగష్టు, సెప్టెంబరు) లో జరగాల్సిన రక్షాబంధన్ ఉత్సవాలు, వరలక్ష్మీ వ్రతాల యోజన చేశారు. అలాగే రాష్ట్ర కమిటీ యొక్క పర్యటనలను, వాటి తేదీలను ఖరారు చేశారు.
మొత్తం 13 జిల్లాల నుంచి 37 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో త్రిపుర రాష్ట్రంలోని శ్రీమాత బాలా త్రిపుర సుందరి పీఠం శ్రీ శ్రీ శ్రీ కపాలనంద స్వామీజీ, మత్స్య నారాయణ దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీ నాగిని రంగారావు, మత్స్యకార సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొండూరు జయరాం లు పాల్గొని మార్గదర్శనం చేశారు.

మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కదిరి పోలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కోలంగారి పోలయ్యలు సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించారు.





