
332views
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామచంద్రస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఏపీఎస్ ఆర్టీసీ కాకినాడ డిపో మేనేజర్ మనోహర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 16వ తేదీ ఉదయం 6, 8, 10 గంటలకు కాకినాడలో బయలుదేరుతాయన్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవం పూర్తయిన తరువాత ఈ బస్సులు భద్రాచలంలో 17వ తేదీ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ తిరుగు పయనమవుతాయని తెలిపారు. ఈ బస్సులకు సాధారణ చార్జీ మాత్రమే వసూలు చేస్తారన్నారు. ప్రతి రోజూ కాకినాడ నుంచి తిరిగే ఏడు సర్వీసులకు అదనంగా ఈ బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఈ బస్సులకు రానుపోను రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని మనోహర్ కోరారు.





