ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 61 ; అయ్యగారి రామమూర్తి పంతులు

354views

ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ (నేటి B.E.L. కంపెనీ) వ్యవస్థాపకులు శ్రీ అయ్యగారి రామమూర్తి పంతులు గారు. వీరు దీనిని 1926లో స్థాపించారు. వారు, వారి తమ్ముడు డా॥ ఎ.ఎన్. రావు గారు రామ లక్ష్మణులులాగా ఎప్పుడూ కలసి ఉండేవారు. కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. శ్రీరామమూర్తి పంతులుగారు బందరులో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ, National Chemicals, Scientific glass products, Jaihind High School స్థాపించారు. Soda Ash Factory బందరులో స్థాపించాలని వారి కోరిక. అది నెరవేరకుండా వారు 1949, జూలై 26న దివంగతులు అయ్యారు.

కోయంబత్తూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ జి.డి. నాయుడుగారు ఈ కంపెనీ చూసి తర్వాత పంతులుగారితో అద్భుతమైన కంపెనీ సైంటిఫిక్ Instrumentation అద్వితీయం అని, హాస్యంగా మీ కంపెనీ అంతా చూసాను, మెలకువలు గ్రహించాను. నేను మరొకటి రేపు స్టార్ట్ చేస్తే! అన్నారు. పంతులుగారు – నవ్వుతూ “తప్పక చేయండి. మనిద్దరి ధ్యేయం మన దేశం పారిశ్రామికంగా – సర్వస్వతంత్రంగా ఉండాలనే కదా!” అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సామాన్యుల కొరకు, వారి ఆర్థిక ఆలంబన కొరకు ఎంతగానో పరితపించేవారు. వారిలో పి. క్రమశిక్షణ, పనిచేయాలనే ఆసక్తి పెంపొందింపచేస్తే వీటి వలన వారు ఆర్థికంగా ఆలు బలపడతారనేది పంతులుగారి ఆలోచన. దాని కొరకే వారి ప్రయత్నాలు.

1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. బర్మా నుంచి చాలా మంది భారతదేశానికి వలస వచ్చారు. ఒకతను పంతులు గారి దగ్గరకు వచ్చాడు. ఏదైనా పని ఇప్పించమని అడిగాడు. ఎంత చిన్న పనైనా సరే అన్నాడు. ఏంపని చేయగలవు అని అడిగారు. టైలరింగ్ నా వృత్తి. అది చేస్తాను అన్నాడు. వెంటనే కుట్టు మిషను కెప్పించారు. దానికి లోను Self repayment మీద ఇప్పించారు. కంపెనీలో వర్కర్స్ కి యూనిఫాంలు కుట్టమన్నారు.

అంతకు ముందే వర్కర్స్ చేత ఒక కో-ఆపరేటివ్ సొసైటీ స్థాపింప చేసారు.కంపెనీ వర్కర్స్ మాత్రమే దాని మేనేజ్మెంట్. అత్యవసర పరిస్థితిలో లోన్ తీసుకోవడం. దానిని వారి నెలసరి జీతంలో రీపేమెంట్ చేయడం. ఈ యూనిఫామ్స్ కి కావలసిన క్లాత్ సొసైటీ తెప్పించింది. దానికి మూలధనం కంపెనీ ఇచ్చింది. ఆ యూనిఫాం క్లాత్ వర్కర్స్ కి లోన్ గా ఇచ్చారు. నెలసరి వాయిదాలలో కట్టాలి. టైలరికి ఎంప్లాయిమెంట్. కంపెనీలో అందరికీ యూనిఫాం, ఎవరికీ, ఎక్కడా ఆర్థికభారము లేకుండా అందరికీ యూనిఫాం. వర్కర్స్ కి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి Self Management of finance, ఒక గుర్తింపు వారి యూనిఫాం వలన. ఒక వలస కాందిశీకుడికి తనపనితో ఆర్జించుకునే అవకాశం కల్పించారు పంతులు గారు.

ఆ రోజుల్లో డబ్బుకు చాలా విలువున్న రోజులు. పావలా (అంటే 25 N.P.) ఎంతో విలువైన కాలం. పంతులు గారికి ఉదాత్తమైన ఆలోచన వచ్చింది. ఆ రోజుల్లో సైంటిఫిక్ కంపెనీలో 600 మంది దాకా వర్కర్స్ ఉండేవారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి సైకిల్ మీద మధ్యాహ్నం భోజనానికి బాక్స్ లో ఏదో తెచ్చుకుని, పని చేస్తుండేవారు. పంతులు గారికి ఒక చక్కటి ఆలోచన, మార్చి నుండి ఎండలు పెరుగుతాయి. వర్కర్స్ కి చల్లటి నిమ్మరసం, ఉప్పు, పంచదార వేసినది మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కొక్క గ్లాసు ఇవ్వాలని, అందుకోసం నిమ్మకాయలు తెప్పించి, దాని నుంచి చెక్కు తీసి రసం పిండేందుకు, 40-45 సంవత్సరములు దాటిన elderly ladies అందరికీ, ముఖ్యముగా భర్తలు పోయి పిల్లల మీదో, అన్నదమ్ముల వడట మీదో ఆధారపడిన వారికి అవకాశము. వర్కింగ్ టైం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల దాకా. ఎందుకంటే ఆ సమయంలో ఇంట్లో వారి పనులు, భోజనాలు, ఇల్లు కడుగుకోవడం, అంట్లు పనులు అయిన తర్వాత, మరల పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపల పని. దానికి వారి రెమ్యూనరేషన్. ఈ తీసిన జ్యూస్ చల్లటి నీటితో కలిపి వర్కర్స్ కి రిఫ్రెష్మెంట్. దీనికి డబ్బు పంతులు గారిదే. వర్కర్స్ హ్యాపీ – ఎండలో చల్లటి నిమ్మకాయ రసం, ఇంట్లో ఆడవారు, వారు రోజూ ఇంట్లో చేసే పని, వర్కింగ్ టైం, ఇంట్లో ఖాళీ సమయం, కొంచెం స్వంత ఖర్చుకి ఎవరినీ అడగవలసిన అవసరం రాకుండా చేతిలో డబ్బులు ఎంతటి ఉదాత్తమైన ఆలోచన.

ఆ రోజుల్లో గూడూరు, చిట్టి గూడూరు, మల్లవోలు, రాయవరం గ్రామాల నుంచి వచ్చి కంపెనీలో పనిచేసే వర్కర్స్ కి, వాళ్ళు ఇంతదూరం ఎందుకు రావడం, అని గూడురులో ఒక బ్రాంచి ఆఫీసు ఓపెన్ చేసి, ఒక సూపర్వైజర్ ని మెటీరియల్ తో పంపించి, ఈ వర్కర్స్ చేత అక్కడే కావలసినవి తయారు చేయించడం, చేసినవి సూపర్ వైజర్ గారు సాయంత్రం బందరు మెయిన్ ఆఫీసులో అప్పచెప్పటం పంతులు గారి రూరల్ డెవలప్మెంట్ – తర్వాత కాలంలో ఇందిరా గాంధీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలకీ పొంతన ఉంది. ఎన్నో పోలికలు ఉన్నాయి.

ఆ రోజుల్లో చదువుకోవడానికి హిందూ హైస్కూల్ కు రెండు బ్రాంచి స్కూల్స్ – R బ్రాంచి, J బ్రాంచి, వీటిలో 3rd form దాకా మాత్రమే ఉండేది. 4th form నుంచి హిందూ హైస్కూల్, ఇదిగాక నోబుల్ హైస్కూల్, ఆడపిల్లలకి లేడి యాంప్తిల్ స్కూల్ ఉండేవి. పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే ఈ స్కూల్స్ మాత్రమే. పంతులుగారి ఆలోచన. దూరాన ఉన్న పిల్లలు చింతగుంటపాలెం, కాలేఖాన్ పేట, శివగంగ, ఇనుకుదురు, సుల్తానగరం పిల్లలు ఇంతింత దూరం నడిచిరాలేక (అందరూ సైకిల్స్ కొనుక్కోలేక) చదువులు మానేసేవారు. ఆ దూరపు పిల్లల కోసం 1947 ఆగస్టు 15న జైహింద్ స్కూల్ ఇనుకుదురులో సెకండరీ స్కూల్ గా ప్రారంభించారు. అందులో వృత్తి విద్య కార్పెంటరీ సెక్షన్ పెట్టారు. ఆయన మనసులో వర్కర్స్ సంక్షేమము ఎప్పుడూ ఉండేది. వర్కర్స్ కి ఆరోగ్య సమస్యలు ఉంటే వారి తమ్ముడు డా॥ ఎ.ఎన్.రావు గారిచే వైద్య సదుపాయం కలిగించేవారు.

ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ గారు Sri ARCHIBALD NYE వారి సతీమణితో బందరు వచ్చారు. సైంటిఫిక్ కంపెనీ విజిట్ చేసారు. వారి సతీమణి కెమేరా చేతిలో నుంచి పడి లెన్స్ కి ఏదో అయి ఫొటో తీయడానికి వీలు అవడం లేదు. Governor NYE గారు పంతులుగారితో నా భార్య కెమేరా క్రిందపడి Stuck అయింది. మద్రాస్ వెళ్ళాక U.K పంపించాలేమో అన్నారు. పంతులుగారు కెమేరా ఇవ్వండి.మా వర్క్ షాపులో చేయగలరేమో అని తీసుకున్నారు. NYE గారు కంపెనీ చూసి వచ్చేందుకు ఒక గంట పైన పట్టింది. ఈ లోపల కెమేరా పర్ఫెక్ట్ గా రిపేరు అయిపోయింది. పంతులుగారు కెమేరా ఇస్తే వారు, వారి సతీమణి సంభ్రమ ఆశ్చర్యంలో మునిగిపోయి “What a wonderful industry is this! What skillful workers you have!” అని మరీ మరీ ప్రశంసించి, అభినందించి వెళ్లిపోయారు.