
217views
హమాస్ తో యుద్ధం కారణంగా కార్మికుల కొరతతో ఇబ్బందిపడు తున్న ఇజ్రాయెల్ నిర్మాణ రంగాన్ని భారత్ ఆదుకోనుంది. 6 వేలకుపైగా భారత కార్మి కులు ఏప్రిల్, మేలో ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాల్లో తర లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించింది. హమాస్ తో యుద్ధం చెలరేగక ముందు పాలస్తీనా అధీనంలోని వెస్ట్ బ్యాంక్ నుంచి 80,000, గాజా నుంచి 17,000 పాలస్తీనియన్లు ఇజ్రాయెల్లో పనిచేస్తుండేవారు. ఘర్షణల నేపథ్యంలో వారి పని అనుమతు లను ఇజ్రాయెల్ రద్దు చేసింది.





