News

భవిష్యత్తు చూడాలంటే భారత్‌కు రావాలన్న అమెరికా రాయబారి

299views

భవిష్యత్తును చూడాలని అనుకునే వారు భారతదేశానికి రావాలని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న గార్సెటి.. భారతదేశం సాధించిన పురోగతి, ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించడంలో భారత్‌ పాత్రను కొనియాడారు. ఈ సదస్సులో మాట్లాడుతూ ‘‘మీరు భవిష్యత్తును చూడాలనుకుంటే.. భవిష్యత్తును ఆస్వాదించాలి అనుకుంటే..భవిష్యత్తు కోసం పని చేయాలని అనుకుంటే భారత్‌కు రండి. భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న నేను నిత్యం దానిని ఆస్వాదిస్తున్నాను’’ అని గార్సెట్టి పేర్కొన్నారు. తాను ఈ సదస్సుకు వచ్చింది పాఠాలు చెప్పడానికి కాదని నేర్చుకునేందుకుని వెల్లడించారు. వివిధ రంగాల్లో భారత్‌, అమెరికా అనుబంధం కొత్త శిఖరాలకు చేరిందని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సలివాన్‌ అన్నారు.