News

కర్నూలులో శిశుమందిర్ ప్రధానాచార్యులకు ఒక రోజు శిక్షణ

570views

విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో 2 .8. 2019 శుక్రవారం శ్రీ సరస్వతీ విద్యా పీఠం అనంతపురం సమితి (రీజియన్) లోని  శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ , కర్నూల్ లో శ్రీ సరస్వతి శిశుమందిర్ ల ప్రధానాచార్యులకు ఒకరోజు వర్గ జరిగింది. పది సంవత్సరములలోపు సేవాకాలం (సర్వీస్)(అనుభవం) కలిగిన ప్రధానాచార్యులు ఈ వర్గలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో  ఆంధ్ర,తెలంగాణ,  కర్ణాటక రాష్ట్రాల సంఘటన కార్యదర్శిశ్రీ లింగం సుధాకర్ రెడ్డి, ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ కర్నాటి హనుమంతరావు, అనంతపురం సమితి సహ కార్యదర్శి శ్రీ విజయానంద్, అనంతపురం సమితి ఈవో శ్రీ వి.సి నరసింహులు మరియు శైక్షణిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వర్గలో శ్రీ సరస్వతి శిశుమందిర్  ప్రధానాచార్యుల బాధ్యతలను మరియు విధులను గురించి అవగాహన కలిగించారు.