News

బక్రీద్‌ రోజున ఆవులను బలి ఇవ్వద్దు: హైదరాబాద్ ముస్లిం మతపెద్దలు నిర్ణయం

1.7kviews

ఈ నెల 12న జరగనున్న బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు . ఎలాంటీ అవంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లతో పాటు, ముస్లిం మతపెద్దలతో పోలీసులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వివాదాలకు దూరంగా పండగ జరుపుకోవాలని సూచించారు.

ఈ నేపథ్యంలోనే సమావేశంలో పాల్గొన్న ముస్లిం పెద్దలు పలు సూచనలు చేశారు. పండగ సందర్భంగా ఆవులను బలి చేయద్దని ముస్లిం నాయకులు, మత పెద్దలకు సూచించారు. పండుగ ఆచారం ప్రకారం నాలుగు కాళ్ల జంతువును బలి ఇవ్వాలని అయితే ఇతర మతాల వారి సెంటిమెంట్లను కూడ గౌరవించాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే పలు సూచనలు చేసి సామరస్యంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పండగను జరుపుకుకోవాలని చెప్పారు.

కేంద్రంలో బీజేపీ అతిపెద్ద మెజారీటీ రావడంతో ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా రాజధాని నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ముఖ్యంగా రెండు వర్గాల మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా అది దేశ వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీంతో గతంలో కంటే బక్రీద్ పండగను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించనున్నారు.