
676views
ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూలై 23న కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ పట్టణ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అక్బరుద్దీన్ ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అక్బరుద్దీన్ ఒవైసీపై ఐపీసీ సెక్షన్ 153-ఏ, 153-బి, 506, సీఆర్పీసీ 156(3) కింద కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అక్బరుద్దీన్‌పై కేసు నమోదుచేశారు.





