
251views
ఉగాది పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈనెల 5, 6వ తేదీలలో ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆయన మంగళవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసుల్లో ప్రయాణించవచ్చన్నారు. విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతితో పాటు రాష్ట్ర పరిధిలోని అన్ని ప్రధాన నగరాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.





