News

గుప్త నిధుల ఆరోపణలను ఖండించిన అహోబిలం మఠాధిపతి

310views

నంద్యాల జిల్లాలోని చారిత్రక అహోబిలం ఆలయంలో గుప్త నిధి తవ్వకాలపై తిరుమల మాజీ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను అహోబిల మఠం 46వ అళగీయసింగరుడు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ తీవ్రంగా ఖండించారు.గుప్త నిధుల ఆరోపణలన్ని అవాస్తవలేనని స్పష్టం చేశారు. కాగా రమణ దీక్షితులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవి ధర్మారెడ్డి అహోబిల మఠం అధికారులతో కలిసి అహోబిలం ఆలయంలో గుప్త నిధులను వెలికితీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.