
415views
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని మధ్యయుగం నాటి కట్టడం భోజ్‌శాల కాంప్లెక్స్ సర్వే పనుల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ) సర్వే నివేదిక ఎలా ఉన్నప్పటికీ దాని ఆధారంగా తమ అనుమతి లేనిదే ఎటువంటి చర్యలకు ఉపక్రమించరాదని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పి.కె.మిశ్రలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కట్టడం స్వరూపాన్ని మార్చేలా తవ్వకాలు జరపరాదని ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఏఎస్‌ఐలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. భోజ్‌శాలలో శాస్త్రీయ సర్వే నిర్వహణకు మధ్యప్రదేశ్ హైకోర్టు మార్చి 11న అనుమతించగా…మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.




