News

స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం

265views

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ అలంకార మండప వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వర్ణ రథంపై అధిష్ఠించి గణేశ నామస్మరణల నడుమ ఊరేగించారు. ఈవో ఎ.వెంకటేశు, డిప్యూటీ ఈవో వాణి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెం డెంట్లు కోదండపాణి, ధనుంజయ, ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌, భక్తులు పాల్గొన్నారు.

సంకటహర గణపతి వ్రతం: వినాయకస్వామి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా గురువారం ఉదయం, సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించిన సామూహిక సంకటహర గణపతి వ్రతంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సిద్ధిబుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయకస్వామి వారి ఉత్సవమూర్తులకు పుష్పాలంకరణ చేసి అర్చకులు, వేదపండితులు వ్రతాన్ని నిర్వహించారు.