News

అర్చకుడిపై దాడి ఘటనను ఖండించిన విశ్వహిందూ పరిషత్

253views

కాకినాడలో అర్చకులపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే చలో కాకినాడకు పిలుపు నిస్తామని విశ్వహిందూ పరిషత్తు నాయకులు హెచ్చరించారు. ఆ సంస్థ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన రాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల సంఘటనా కార్యదర్శి గంధం గోవింద్, హైందవవీర్ అధ్యక్షుడు పి.వరప్రసాద్ తదితరులు అర్చకులను కలిసి సంఘీభావం తెలిపారు. పిఠాపురం, అంతర్వేది, రామతీర్థం, భీమవరం ఘటనల్లాగే దీనినీ నీరుగార్చకుండా నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడితే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.