
244views
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా తిరుమలలో తుంబురు తీర్థంకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులను తుంబరతీర్థంలోకి అనుమతించారు టిటిడి అధికారులు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు తుమ్మల తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, నీళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే వైద్య బృందాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్‌లు అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంచారు. టీటీడీ భద్రత, పోలీస్, ఆటవీసిబ్బంది భక్తులకు భద్రత కల్పిస్తూ సేవలందిస్తున్నారు.





