
260views
పురాతన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయడం చాలా పవిత్రమైన కార్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ కృష్ణమోహన్‌రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దువ్వ గ్రామంలో వేంచేసియున్న శ్రీ పర్వతవర్దిని శ్రీనాగేశ్వరస్వామి ఆలయంలో పరాశర వైదికాగమవేద శాస్త్ర పరిషత్ 15వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేదశాస్త్ర పండిత సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత జస్టిస్ కృష్ణమోహన్‌కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం జరిగిన వేద శాస్త్ర పండితుల సన్మాన సభలో జస్టిస్ పాల్గొని మాట్లాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వేదమే మూలమని చెప్పారు. వేద విద్యను ప్రోత్సాహించాలని కోరారు. సమాజంలో వివిధ రంగాలలో ఉన్నత స్థానాలకు చేరిన వారు పేదల అభివృద్దికి కూడా తోడ్పాటును అందించాలని కోరారు.





