
370views
సింహాచలం క్షేత్రంలో మే 10న జరిగే చందనోత్సవానికి సంబంధించి రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేశారు. ట్రస్ట్ సభ్యులతో చర్చించి ఈనెల 30వ తేదీలోపు దేవదాయశాఖ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించారు. చందనోత్సవం రోజు కేవలం విధుల్లో ఉన్న వైదికులకు, ఆలయ సంప్రదాయం ప్రకారం అనుమతులు ఉండేవాళ్లకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పించాలని, మిగతా వారికి కల్పించవద్దని పేర్కొన్నారు. చందనోత్సవం రోజు ఘాట్‌రోడ్డులో కేవలం మినీ బస్సులు మాత్రమే నడపాలని తెలిపారు. కేవలం ఘాట్‌రోడ్డులో ఒకవైపు మాత్రమే అనుమతి ఉండేలా చూడాలన్నారు. ఆరోజు విధుల్లో ఉండే స్టాఫ్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే టికెట్ల తనిఖీలు, క్యూల నిర్వహణ వద్ద పోలీసులను ఏర్పాటు చేయాలని సూచించారు.





