News

భారత నౌకాదళం భేష్…..అమెరికా రక్షణ మంత్రి ప్రశంస

233views

హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కొనియాడారు. ఈ మేరకు ఆయన భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి డ్రోన్ల కొనుగోలు చేయాలన్న భారత ప్రణాళికలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి మద్దతుగా భారత్, అమెరికాల రక్షణ భాగస్వామ్యంలో వృద్ధి గురించి కూడా ముచ్చటించుకున్నారు. ఈ మేరకు ఒక ప్రక హటన వెలువడింది. అరేబియా సముద్రం, దాని పక్కన ఉన్న జలమార్గాల్లో చట్టబద్ధ పాలనకు భారత్ అందిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ద్వైపాక్షిక, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అనేక అంశాలపై తాను ఆస్టి న్తో చర్చలు జరిపినట్లు రాజ్నాథ్ సింగ్.. ‘ఎక్స్’లో పేర్కొన్నారు. శుక్రవారం భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి.. సముద్రపు దొంగల చేతిలో చిక్కుకున్న ఒక వాణిజ్య నౌకను విడిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 17 మంది బందీలను విడిపించి, 35 మంది సాయుధ సముద్రపు దొంగలను నిర్బంధించింది. ఈ నేప థ్యంలో భారత నౌకాదళాన్ని ఆస్టిన్ ప్రశంసించారు.