
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అంటే CAA అమలులోకి వచ్చిన తర్వాత ముస్లిం సమాజంలో గందరగోళాన్ని వ్యాప్తి చేసేందుకు విఫలయత్నం జరుగుతోంది. ముస్లింల బుజ్జగింపు దగ్గర నుంచి ఈ చట్టం విషయంలో అనేక రాజకీయ పార్టీలు ముస్లింలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. CAA కి సంబంధించి అపవాదులు ఏంటి..?? మరియు వాస్తవికత ఏంటి..?? ఒక్కసారి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
అవాస్తవం
CAA అమలు వల్ల ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు తమ పౌరసత్వాన్ని కోల్పోతారా..??
వాస్తవం
ఈ బిల్లులో భారతీయ ముస్లిం కమ్యూనిటీతో సహా ఏ భారతీయ పౌరుడి పౌరసత్వాన్ని రద్దు చేసే విధంగా అలాంటి నిబంధన ఏదీ లేదు.
అవాస్తవం
CAA భారతీయ ముస్లింలను ప్రభావితం చేయగలదా?
వాస్తవం
ఇది పూర్తి అబద్ధం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లలో, హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, క్రిస్టియన్ మరియు పార్సీ వర్గాల ప్రజలు వారి మతం ఆధారంగా హింసించబడ్డారు, అందుకే వారికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ నిబంధన చేయబడింది.
అవాస్తవం
పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది, లేకపోతే వారిని బహిష్కరిస్తారా?
వాస్తవం
ఈ వాదన పూర్తిగా పుకారు. ఈ చట్టం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అవాస్తవం
CAA మతపరమైన హింసకు సంబంధించినది అయితే, షియాలు, అహ్మదీయాలు, బలూచ్ మరియు రోహింగ్యాలను కూడా అందులో చేర్చాలి.
వాస్తవం
ఈ సమూహాలన్నీ ముస్లింలు, ముస్లింలు కాబట్టి వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లలో మైనారిటీలు కాదు.
వాస్తవం
ముస్లింలకు ఆశ్రయం ఇవ్వడానికి 56 కంటే ఎక్కువ ముస్లిం దేశాలు ఉన్నాయి కానీ ముస్లిమేతరులకు ఆశ్రయం కల్పించే ఏకైక దేశం భారతదేశం.
దయచేసి పుకార్లను పట్టించుకోకండి.
CAA ఏ ప్రాంతం లేదా ఏదైనా నిర్దిష్ట మతానికి చెందిన భారతీయ పౌరులపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. ఎందుకంటే ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికి..లాక్కోవడం కోసం కాదు.





