News

సమస్త జీవరాశిలో పరమాత్ముని చూడాలి

236views

సమస్త జీవరాశిలోను పరమాత్ముని చూసే ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గమని ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానంద గిరి అన్నారు.అమలాపురంలోని నల్లమిల్లి గ్రామంలో సద్గురు గీతాశ్రమంలో మురళీకృష్ణ మందిరంలో స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణ చేశారు. యజ్ఞయాగాదులు నిర్వహించటం, దానధర్మాలు చేయటం, మంత్రజపం, తపస్సు, సేవ వలన జ్ఞానవైరాగ్యాలు కలుగుతాయని కృష్ణ పరమాత్మ భోధించారని తెలిపారు. కేవలం మానవులలో మాత్రమే కాదు, సమస్త జీవరాశిలోను భగవంతుడిని చూడాలని ఆయన అన్నారు. ఏ జీవికీ మనవల్ల అపకారం జరగకుండా, చేతనైనంత ఉపకారం జరిగేలా జీవించటమే జీవిత పరమార్థమని, అదే అసలైన ధార్మిక మార్గమని ఉపదేశించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పాదపూజలు, తులాభారం నిర్వహించారు. కార్యక్రమంలో మాతా బ్రహ్మానంద గిరి, మాతా ప్రవానంద గిరి, మాతా పరబ్రహ్మానంద గిరి, భక్తులు పాల్గొన్నారు.