
285views
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్‌లో ఉపయోగించే రెండు అత్యాధునిక యుద్ధనౌకలు బుధవారం చేరాయి. వీటికి ఐఎన్‌ఎస్ అగ్రే, ఐఎన్‌ఎస్ అక్షయ్ అని పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరి సతీసమేతంగా పాల్గొన్నారు. 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకలు.. 25 నాట్స్ గరిష్ఠవేగంతో ప్రయాణిస్తాయి. తీర ప్రాంతాల్లో యాంటీ సబ్‌మెరైన్ ఆపరేషన్లలో పాల్గొనడంతో పాటు, మందుపాతరలు కనిపెట్టడం, నిఘా తదితర కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దేశీయంగా 8 సబ్‌మెరైన్ వార్ఫేర్ షేలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్‌డబ్ల్యూ ఎస్‌డబ్ల్యూసీ) నౌకలను భారత్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఈ యుద్ధనౌకలు.. నౌకాదళంలోకి చేరాయి.





