News

సత్ప్రవర్తనతో సమాజానికి మేలు

362views

మనకు ఎంత కష్టం వచ్చినప్పటికీ ఎదుటి వారికి మేలు జరగాలని ఆశించడమే సమాజానికి మేలు చేస్తుందని ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెంలోని సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రవచనం చేశారు. సనాతన ధర్మం గురించి వివరిస్తూ నేటి ఆధునిక యుగంలో నైతిక విలువలు నానాటికీ దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వవ్యస్థ ద్వారానే నైతిక విలువలు పెంపొందించవచ్చని, నేను, నాది అనే అహాన్ని విడిచి మనం అనే భావనతో ఉండడం అందరికీ మేలు చేస్తుందన్నారు.