
304views
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు అటవీ రేంజ్‌లో మర్రిపాకలు సమీపంలోనున్న రెండు టేకు చెట్లను రామలక్ష్మణులుగా అక్కడి గిరిజనులు పూజిస్తుంటారు. ఇందులో రాముని చెట్టు పూర్తిగా ఎండిపోగా, లక్ష్మణ చెట్టు ఎండిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఈ చెట్లు దాదాపు 150 ఏళ్ల నుంచి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. తమ పూర్వీకుల నుంచి వీటిని పూజిస్తున్నామని తెలిపారు. రాముని చెట్టు ఎండిపోవడంపై వారంతా ఆందోళన చెందుతున్నారు.
అపూర్వమైన చెట్ల సంరక్షణకు చర్యలు
మర్రిపాకలు రేంజ్‌లోని రామలక్ష్మణ్ చెట్లను అపూర్వమైన చెట్లుగా ప్రభుత్వం గుర్తించినట్లు రేంజర్ భార్గవవర్మ తెలిపారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1853లో కేరళలోని నీలంబర్‌లో కన్నోలీటేకు ప్లాంటేషన్ కంటే ఈ రెండు టేకు చెట్లు పెద్దవని అప్పట్లో మర్రిపాకలు మునసబు మెట్టడం రన్‌జాందొర తెలిపినట్లు రికార్డులో నమోదైందన్నారు.





