
243views
కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’ నిధులతో అన్నవరం దేవస్థానంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 7న శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. 7న ఉదయం వర్చువల్‌గా ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి ఆలయ ప్రాంగణంలోని రామాలయం వద్ద స్క్రీన్లు, వేదిక సిద్దం చేస్తున్నారు. ఏర్పాట్లును రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సీఈ సీఎస్‌ఎన్ మూర్తి, ఈఈ రాజారావు, కేంద్ర పర్యాటక శాఖ అధికారి చేతన్, దేవస్థానం ఈవో కె. రామచంద్రమోహన్, ఈఈ మురళీ బాలకృష్ణలు సోమవారం పరిశీలించారు. కేంద్రం మంజూరు చేసే రూ. 20 కోట్లతో అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ స్థలాలను పరిశీలించారు. ఆయా నిర్మాణాలకు గతంలో చేసిన ప్రతిపాదన, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు తదితర అంశాలపై చర్చించారు.





