
358views
శ్రీశైలం మల్లికార్జున స్వామివారి పుణ్యక్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సోమవారం నల్లమల అడవుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటున్నారు. నాగులూటి నుంచి పెద్దచెరువు, భీమునికొలను, కైలాస ద్వారం లాంటి దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నారు.





