News

ముంబయి పేలుళ్ల కీలక సూత్రధారి మృతి

258views

ముంబయి ఉగ్రదాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా మృతి చెందాడు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ నగరంలో అతడు గుండెపోటుతో మృతిచెందినట్లు నిఘా వర్గాలు శనివారం వెల్లడించాయి. మల్కాన్‌వాలాలో అజామ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపాయి. 26/11 పేలుళ్లతోపాటు.. 2006లో ముంబయి రైలు పేలుళ్ల వెనుకా అతని హస్తం ఉంది. ఈ ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 800ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2008 ముంబయి తాజ్‌హోటల్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడనే కారణంగా అమెరికా అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జాబితాలో చేర్చింది.