News

హిందూ సమాజ సంఘటితంతోనే విశ్వ మానవాళికి సుఖశాంతులు

472views

గత 98 ఏళ్లగా రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ దేశం కోసం పని చేస్తున్నదని, హిందూ సమాజ సంగటితంతో దేశం శక్తివంతం అవుతుందని.. తద్వారా ప్రపంచం సుభిక్షంగా ఉంటుందన అఖిలభారత సహ సంయోజక ధర్మ జాగరణ ఆదరణీయ ఆలే శ్యాం కుమార్ అన్నారు. కోల్పోయిన గుణాలను, విస్మరించిన గత చరిత్ర వైభవాన్ని, దేశభక్తిని నింపే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తున్నదని వెల్లడించారు. ఫిబ్రవరి 18 తేదీ ఆదివారం కడప నగర సాంఘిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం కుమార్ మాట్లాడుతూ దేశం కోసం నిస్వార్థంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని, మనమంతా ఒకే తల్లి సంతానం.. సోదర భావంతో మెలగాలని, దేశం పట్ల భక్తి భావం ఉండాలని కోరారు. శతాబ్దాల బానిసత్వ కారణంగా దేశభక్తి లోపించినదని, తిరిగి దేశ ప్రజల్లో దేశభక్తి పెంపొందించే కార్యక్రమం ఆర్ఎస్ఎస్ నిరంతరం చేస్తున్నదని తెలిపారు. హిందూ సమాజం కోసం అనేకమంది పనిచేశారని చెప్పారు. శివాజీ జీవితమే హిందుత్వమని, అందుకే శివాజీ జయంతి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి మహానుభావులు ప్రయత్నాలు చేశారని, స్వామి వివేకనంద విదేశాలలో పర్యటించి దేశ గొప్పతనం, గురించి చరిత్ర, వీరుల గురించి వివరించడం జరిగినదని పేర్కొన్నారు. గొప్ప దేశభక్తుడఅయిన సుభాష్ చంద్రబోస్ విరోచిత పోరాటం సాసోపేతమైనదని వివరించారు. ఇలా ఎందరో మహానుభావులు దేశం కోసం ధర్మం కోసం పనిచేశారు. పరమ పూజనీయ డాక్టర్ జీ కూడా ఇదే కోరుకున్నారని గుర్తుచేశారు. అందుకే 1925 లో విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ ప్రారంభించారని గుర్తుచేశారు. హిందువులు ఏనాడు ఇతరులపై దాడులు చేయనేలేద, అందరినీ ఆదరించే గుణం హిందువుల స్వభావమని తెలిపారు. విదేశాల నుంచి అనేకమంది ఈ దేశానికి వచ్చారని, వారందరినీ ఆదరించి అక్కున చేర్చుకుని ఆదరించామని చెప్పారు. యూదులను ప్రపంచం మొత్తం తిరస్కరించిన, ఒక భారతదేశం మాత్రం యూదులను ఆదరించి వారిని అక్కున చేర్చుకొని రక్షణ కల్పించిదన్నారు. పార్శి లను కూడా ఆదరించడం జరిగినది. గ్రీకులు, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్, షేక్ కు, హునులు,తురుష్కు లు, మొగలాయిలు ఇలా ఎంతోమంది భారతదేశానికి వచ్చారని వెల్లడించారు. విదేశీ దురాక్రమణ దారుల కారణంగా దేశం నష్ట పోయినదని, మన సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేశారని బాధను వ్యక్తం చేశారు.

హిందూ జీవన విధానం గొప్పది
హిందూ జీవన విధానం చాలా గొప్పదని, ప్రకృతిని ఆరాధిస్తాము. చెట్టును, పుట్టను, కొండను, నదులను పూజిస్తాము. విష సర్పాలను కూడా పూజిస్తున్నామని శ్యాం కుమార్ పేర్కొన్నారు. ప్రకృతి వనరులను పరదేశీయులు అందిన కాడికి దోచుకుని వాడుకుంటున్నారన్నారు. ఇతర దేశస్థుల కారణంగానే పర్యావరణం కలుషితమవుతున్నది. తుఫాన్ లు, వరదలు, భూకంపాలు వంటి విపత్తులకు కారణమవుతున్నదని తెలిపారు. భారతీయ జీవన విధానంతో పర్యావరణం రక్షించబడుతున్నది. అందుకే ప్రపంచం హిందుత్వాన్ని ఆదరిస్తున్నదని తెలిపారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ, భారత, భాగవత గ్రంథాలు భారతీయుల ఆదర్శ గ్రంధాలు. ఈ భూమిని పూజించే వారే హిందువులు. రాష్ట్రీయులు అని చెప్పారు.

హిందూ సమాజం జాగృతం కావాలి
హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, హిందూ సమాజం సంగటితంగా ఉంటేనే శక్తి శక్తివంతం అవుతుందని, భారతదేశం శక్తివంతం అవుతేనే ప్రపంచ మానవాళికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే దేశ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించాల్సిన అవసరంఉందన్నారు. క్రికెట్ ఆటలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతే సంబరాలు చేసుకునే వారు ఉన్నారని, ఈ తీరు జాతికి మంచిది కాదని, దేశం పట్ల భక్తి ప్రేమ కలిగి ఉండాలన్నారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినదని, అయితే దేశాన్ని మత ప్రాతిపదికన విడగొట్టబడినదని, పాకిస్తాన్ లో ఉన్న కోట్ల మంది హిందువులు ఇప్పుడు కేవలం లక్షల్లో మిగిలి ఉన్నారని, అక్కడి హిందువులు ఏమైపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలలో హిందువులకు రక్షణ లేదని, ఊచకోతల కోశారని, కొంతమంది మతం మార్చబడ్డారు. హిందువుల శాతం నానాటికి తగ్గిపోతున్నది. హిందువుల శాతం (సంఖ్య) తగ్గిపోతే హిందువులకు రక్షణ ఉండదని కూడా చెప్పారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు.. కాశ్మీర్ లో 4 లక్షల మంది హిందువులను తరిమేశారు. అక్కడి హిందువులు అస్తిపాస్తులను వదిలేసి కట్టుబట్టలతో పారిపోయి దేశంలోనే శరణార్థులుగా బ్రతుకుతున్న దుస్థితికి కారకులు ఎవరని ప్రశ్నించారు. బైంసాలో అల్లర్లు చెలరేగుతున్నాయి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. పాతబస్తీలో హిందువుల మైనారిటీగా మారారని ఉదహరించారు.

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట
500 దశాబ్దాల పోరాట ఫలితమే అయోధ్య రామాలయం. అనేక యుద్ధాలు జరిగాయి. లక్షలాదిమంది ప్రాణ త్యాగాలు చేశారు. ఫలితంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీరామ జన్మభూమి అయోధ్యలో బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జనవరి 22 తేదీన వైభవోపేతంగా జరిగినదని గుర్తుచేశారు. అయోధ్య పూజిత అక్షింతలు జనవరి 1 నుంచి 15 తేదీ వరకు దేశవ్యాప్తంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా శోభాయమానంగా శోభాయాత్రలు నిర్వహించారు. ప్రపంచం మొత్తం పండుగ చేసుకున్నది. సమస్త మానవాళికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడు. విశ్వనగరంగా అయోధ్య రూపుదిద్దుకుంటుందని అభిప్రాయపడ్డారు.

సమాజంలో మార్పు
హిందూ జీవన విధాన గొప్పతనాన్ని ఇతర దేశస్థులు గుర్తిస్తున్నారని, వైట్ హౌస్ లో దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. వేదమంత్రాలు, గాయత్రి మంత్రం, భగవద్గీత వంటివి పటిస్తున్నారు. యోగాసనాలు చేస్తున్నారు. ఇస్లామిక్ బ్రదర్ వుడ్ ఎక్కడున్నది. చర్చిలకు వెళ్లే శాతం తగ్గిపోతున్నది. గోమాతను పూజిస్తాం. పర స్త్రీని సోదరీ భావంతో చూస్తున్నాము. దేశాన్ని మాతృభూమిగా చూస్తున్నాం. అన్ని సమస్యలకు పరిష్కారం హిందూ సమాజంమే మూలం బి అభిప్రాయం వెళ్లబుచ్చారు. హిందూ జీవన విధానం పట్ల ఇతర దేశస్తులు ఆకర్షితులు అవుతున్నారు. హిందువుల గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు. హిందూసమాజ సంఘటితంతోనే దేశం శక్తివంతం అవుతుంది. దేశం శక్తివంతం అవుతేనే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. అందుకే హిందూ సమాజాం శక్తివంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, ఈ పనిననే ఆర్ఎస్ఎస్ గత 98 సంవత్సరాలుగా చేస్తున్నది. దేశ ప్రజల పట్ల దేశభక్తి పెంపొందిస్తున్నది. నగరాలు, ఉపనగరాలు, బస్తీలు, ఉపబస్తీలు, మండలాలు, ఉపమండాలు గ్రామాలలోకి ఆర్ఎస్ఎస్ వెళ్లాలి. శాఖలు నిర్వహించాలి. తద్వారా వ్యక్తి నిర్మాణం జరగాలని కోరారు.