News

ప్రభుత్వం ఈడీఎక్స్ సంస్థ ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి : ఏబీవీపీ

186views

రాష్ట్ర ప్రభుత్వం ఈడీఎక్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని అఖిల భారత విద్యార్ధి పరిషత్- ఏబీవీపీ విభాగం ఎస్ఎఫ్‌డీ కన్వీనర్ మారుతి డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఏబీవీపీ ఎప్పుడు వ్యతిరేకం కాదన్నారు. ఇటువంటి నూతన ప్రణాళికలు ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో బై జూస్ లాంటి సంస్థలతో చేసిన ఒప్పందాలు, జరిగిన నష్టాలను పరిగణంలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు చేసుకున్న ఒప్పందంలో పరీక్షలకు సంబంధించి, మూల్యాంకనం చేసే విధానం, సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు అనే విషయాలపై సరైన అవగాహన కల్పించాలన్నారు. పైగా విద్యాసంవత్సరం ముగింపు దశలో దీనిని తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.