
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక ప్రకటన చేసింది. 25 ఏళ్ళ వయస్సు లోపు వారు గోవిందకోటి రాస్తే బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపింది. యువతలో తిరుమలేశుడిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మికత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
గోవింద నామాన్ని పదిలక్షల 116 సార్లు రాస్తే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ వెల్లడించింది. ఏప్రిల్ కు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారి వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్ లో చేపట్టినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించామన్నారు.
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లి గ్రామ పరిధిలోని రాజనాలబండ ప్రసన్న ఆంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి తీసుకుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య ఒప్పందం జరిగింది. మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఏకాంబరం ఆలయ పత్రాలను టీటీడీ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతికి అందజేశారు. ఈ ఆలయాన్ని పుంగనూరు గ్రూపు ఆలయాల పరిధిలోకి తీసుకున్నారు. ఇకపై ఆలయాల నిర్వహణను టీటీడీ నిర్వహించనుంది.






