News

తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం

248views

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనుంది. పదిరోజులపాటు వైకుంఠద్వార దర్శ నాన్ని కల్పించడంతో భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారి ఆలయంలోని అలంకరణలు మార్చారు. బెంగళూరుకు చెందిన దాత సునీత సహకారంతో అలంకరణలు చేపట్టా మని తితిదే ఉద్యానవన శాఖ డీడీ శ్రీనివాసులు తెలిపారు.