News

పర్యాటక కేంద్రంగా కరసేవక్‌పురం

238views

ఆధ్యాత్మిక నగరి అయోధ్యలోని రామ మందిరానికి అల్లంత దూరాన రామ జన్మభూమి న్యాస్‌ నిర్వహిస్తున్న ‘కార్యశాల’కు కేంద్రమైన కరసేవక్‌పురం గత నాలుగేళ్లుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామమందిర నిర్మాణానికి అనుకూలంగా 2019లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుతో ఈ కార్యశాల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆలయ నిర్మాణంలో వాడుతున్న స్తంభాలు, రాళ్లకు ఇక్కడ మెరుగులు దిద్దుతున్నారు. 30 ఏళ్లకు పైగా నిర్వహిస్తున్న ఈ కార్యశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య గత నాలుగేళ్లుగా బాగా పెరిగింది. ఉదయం 8.00 నుంచి సాయంత్రం 5.00 గంటల దాకా స్థానిక మహిళలు ఇక్కడ నగిషీ పనుల్లో పాల్గొంటున్నారు. ఈ మహిళలు శ్రీరాముడి సేవలో రోజూ కొంత అదనపు సమయం పనిచేస్తున్నారు. అందంగా చెక్కిన రాళ్ల ఉపరితలం మీద ఏర్పడిన నల్లటి మచ్చలను వీరు ఐరన్‌ బ్లేడుతో అంగుళం అంగుళం తొలగిస్తున్నారు. ఈ మహిళలకు రూ.12 వేల నెలజీతం ఇస్తున్నారు. రాజస్థాన్‌లోని సోమ్‌పురా నుంచి వచ్చిన పురుష కార్మికులు కూడా పనిచేస్తున్నారు.